జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉంది. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ ఈ చిత్రం కంప్లీట్ చేసుకుంది. భారీ బడ్జెట్ తో యువసుదా ఆర్స్, ఎన్టీఅర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెలుగులోకి దేవర మూవీతో ఎంట్రీ ఇస్తోంది.
ఇక సైఫ్ ఆలీఖాన్ పవర్ ఫుల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఓ ఐలాండ్ లో సముద్ర తీరంలో జరిగే కథగా ఈ మూవీ ఉండబోతోంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి జూనియర్ ఎన్టీఆర్ లుక్ ని రివీల్ చేశారు. గెడ్డంతో బ్లాక్ కలర్ కాస్ట్యూమ్స్ తో ఒక నాయకుడి తరహాలో కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో లుక్ కోసం జూనియర్ ఎన్టీఆర్ పెర్ఫెక్ట్ మెయింటేన్ చేస్తున్నారు.
రెగ్యులర్ గా పెర్సనల్ ట్రైనర్ పెట్టుకొని వర్క్ అవుట్స్ చేస్తున్నారు. హాలిడే రోజుల్లో కూడా గ్యాప్ తీసుకో
అయితే దేవర సినిమాలో మాస్ అవతార్ కావడం అందుకు తగ్గట్లుగా గెడ్డం పెర్ఫెక్ట్ షేప్ లో ఉంచుకున్నాడు.తారక్ అభిమానులని ఈ లుక్ మెస్మరైజ్ చేస్తోంది. ఎక్కువగా క్లీన్ సేవ్ లో కనిపించే తారక్ ఈ రకమైన మాస్ గెడ్డంతో కనిపించడం కొత్తగా అనిపిస్తోంది. దీంతో ఈ ఫోటోని ట్విట్టర్ లో విస్తృతంగా వైరల్ చేస్తోన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఫ్యామిలీతో కలిసి తారక్ వెకేషన్ కి వెళ్ళారు. దీనికి సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.